సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు: ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్
సాంకేతిక ఆధారాలతో నిందితుడిని పట్టుకున్న సీసీసీ నస్పూర్ పోలీసులు..
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని గాంధీనగర్‌లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను చించిన కేసులో నిందితుడిని సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నామని సీసీసీ నస్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎండీ. తహసీనుద్దీన్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 27వ తేదీ రాత్రి 10 గంటల తర్వాత నస్పూర్‌లోని గాంధీనగర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం పక్కన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేసినట్లు పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందింది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆధునిక సాంకేతిక ఆధారాలను విశ్లేషించి శుక్రవారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు గాంధీనగర్‌కు చెందిన కుంచం రాముగా గుర్తించారు. మద్యం మత్తులో తానే ఆ ఫ్లెక్సీలను చించినట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతనిపై చట్టపరమైన కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు ఎస్సై వెల్లడించారు.
వదంతులు నమ్మవద్దు.. తప్పుడు పోస్టులు పెడితే అడ్మిన్లపై చర్యలు:
ఈ సందర్భంగా ఎస్సై ఎండీ. తహసీనుద్దీన్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఫ్లెక్సీల ఘటనపై తొందరపడి ఎలాంటి తప్పుడు ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని సూచించారు. ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో, గ్రూపుల్లో తప్పుడు పోస్టులు పెట్టవద్దని హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ తప్పుడు ఫోటోలు, వీడియోలను సృష్టించి పోస్ట్ చేయకూడదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే పోస్ట్ చేసిన వ్యక్తులతో పాటు సంబంధిత గ్రూప్ అడ్మిన్లపై కూడా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద ప్రయాణికులు, వ్యాపారులు, సాధారణ ప్రజల సౌకర్యార్థం రూ. 20 లక్షల మున్సిపల్ నిధులతో నిర్మించనున్న ఆధునిక పబ్లిక్ టాయిలెట్స్ పనులకు శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. సీసీసీ కార్నర్ వద్ద మరుగుదొడ్ల సౌకర్యం లేక ప్రజలు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు, వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే స్పందించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ ద్వారా సింగరేణి సీఎండీ, స్థానిక యాజమాన్యంతో మాట్లాడి, అడ్డంకిగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను సింగరేణి సీఎస్ఆర్ నిధులతో తొలగింపజేసి ఈ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారని వివరించారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు, జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్, విద్యుత్ అధికారులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. గత ఎన్నికల్లో తన సొంత డివిజన్ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల సృజనాత్మకతను వెలికితీసేలా రూపొందించిన ‘మా తొలి అడుగులు’ నీతి కథల పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. విద్యార్థుల్లో రచనా నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనా శక్తి, నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో పాఠశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సంకలనంలో విద్యార్థులు స్వయంగా రాసిన 20 ఆసక్తికరమైన నీతి కథలను పొందుపరిచారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ లోకేష్ కుమార్ యాదవ్ పుస్తకావిష్కరణ చేసి, రచనలో భాగస్వాములైన చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా తమ ఆలోచనలకు అక్షర రూపమిచ్చి కథల పుస్తకాన్ని వెలువరించడం ఎంతో గర్వకారణమన్నారు. ఇలాంటి ప్రయోగాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, భాషా ప్రావీణ్యాన్ని, సృజనాత్మకతను గణనీయంగా పెంచుతాయని పేర్కొన్నారు. ఈ పుస్తక రూపకల్పనలో తెలుగు విభాగం ఉపాధ్యాయులు అందించిన మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతగానో దోహదపడ్డాయని అధ్యాపకులు తెలిపారు. చిన్నారుల తొలి సాహిత్య ప్రయత్నంగా నిలిచిన ‘మా తొలి అడుగులు’ పుస్తకం పాఠశాల విద్యా ప్రయాణంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని హర్షం వ్యక్తం చేశారు. భావి రచయితలుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి నరేష్ ఆచార్య, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.