మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్
సోన్, ఆర్.కె న్యూస్: మండలంలోని న్యూ వెల్మల్ గ్రామంలో ఆత్మ కార్యక్రమం కింద రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, వాటి ఫలితాల ఆధారంగా ఎరువుల వినియోగంపై మండల వ్యవసాయ అధికారి వినోద్ కుమార్ అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. భూసార పరీక్షల ఫలితాల ప్రకారం పంటలకు అవసరమైన పోషకాలను సరైన మోతాదులో అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతేకాకుండా అనవసరమైన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సాగు పెట్టుబడి ఖర్చు ఆదా చేసుకోవచ్చని వివరించారు. రైతులు భూసార పరీక్షలను అలవాటుగా చేసుకొని నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ ఉమా మహేశ్వరి, రైతులు మల్లయ్య, దయాసాగర్, అరుణ్, శ్రీనివాస్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.








