కడ్తాల్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు

500 మంది భక్తులు అయ్యప్ప మాలధారణ

సోన్, ఆర్.కె న్యూస్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని స్వర్ణ నది తీరాన కొలువైన శ్రీ ధర్మశాస్త అయ్యప్ప దేవాలయంలో మంగళవారం వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అయ్యప్ప నామస్మరణ, శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఉదయం సుప్రభాత సేవ నిర్వహించి స్వామివారిని వివిధ రకాల రంగురంగుల పూలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులు అయ్యప్ప మాలధారణ స్వీకరించారు. ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి అయ్యప్ప ఆలయంగా పేరొందిన ఈ క్షేత్రానికి నిర్మల్‌తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ఆలయ గురుస్వామి నర్సారెడ్డి నేతృత్వంలో మాలధారణ కార్యక్రమంలో పాల్గొన్నారు. 41 రోజుల మండల దీక్షలో పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురుస్వామి భక్తులకు వివరించారు. మధ్యాహ్నం అన్నప్రసాదం (బిక్ష) ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రీ ధర్మశాస్త్ర ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment