నస్పూర్‌లో ట్రస్మ క్యాలెండర్ ఆవిష్కరణ

నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం (ట్రస్మ) నూతన సంవత్సర క్యాలెండర్‌ను శనివారం నస్పూర్‌లో ఆవిష్కరించారు. ట్రస్మ రాష్ట్ర ప్రధాన సలహాదారు, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్‌ను విడుదల చేశారు. అనంతరం తొలి ప్రతిని సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణికి అందజేశారు. ఈ సందర్బంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, ప్రైవేటు పాఠశాలల సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మ జిల్లా కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి రామకృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఉపేందర్, ఉపాధ్యక్షుడు కమ్రోద్దీన్, నస్పూర్ మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి వూట్లా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment