జీఎంతో భేటీ అయిన మేయర్, మున్సిపల్ అధికారులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కొత్తగా ఏర్పడిన మంచిర్యాల నగర పాలక సంస్థ అభివృద్ధికి సింగరేణి యాజమాన్యం పూర్తిస్థాయిలో సహకరించాలని మేయర్ ధర్ని మధుకర్ కోరారు. సోమవారం శ్రీరాంపూర్ సింగరేణి జనరల్ మేనేజర్ కార్యాలయంలో జీఎం ఎం.శ్రీనివాస్‌ను మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీఎంను శాలువాతో సన్మానించారు. మున్సిపల్
కార్పొరేషన్ పరిధిలో సింగరేణి విస్తరించి ఉన్న డివిజన్లలోని పలు ప్రజా సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. పారిశుధ్యం, నీటి సరఫరా మెరుగుపరచాలని, విద్యుత్ దీపాలు, రోడ్ల మరమ్మతులు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా రెండో డివిజన్ ప్రాంతంలో నెలకొన్న డంప్ యార్డ్ సమస్యను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నగర అభివృద్ధిలో సింగరేణి భాగస్వామ్యం కీలకమని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కార్పొరేటర్లు బండారి సుధాకర్, వేల్పుల రవీందర్, అగ్గు సాగర్, పత్తి పకృతి, బొడ్డు స్వప్న, నాయకులు తోట శ్రీనివాస్, మర్రి రాజమొగిలి, పత్తి వెంకటేష్, బొడ్డు తిరుపతి, మున్సిపల్ సిబ్బంది, జీఎం కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







