కొత్త లేబర్ కోడ్స్‌పై అవగాహన.. కార్మిక సంక్షేమ చర్యలపై సంతృప్తి
నస్పూర్, ఆర్.కె న్యూస్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌పై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్, హైదరాబాద్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) బిస్వ భూషణ్ పృష్టి బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఎస్సార్సీ ఓసీపీ కార్మికుల వేతనాలు, హాజరు, సెలవుల రికార్డులను, ఫామ్-ఏ రిజిస్టర్లను తనిఖీ చేశారు. కార్మికులకు అందుతున్న వైద్య సేవల, పీఎఫ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యటనలో
భాగంగా సీసీసీ గెస్ట్ హౌస్‌లో లేబర్ కమిషన్ బృందానికి ఎస్సార్పీ ఓసీపీ సంక్షేమ అధికారి ఓంకార్ బాబు, శ్రీరాంపూర్ ఏరియా డీజీఎం అనిల్ కుమార్ పూర్తి వివరాలను అందజేశారు. ఉద్యోగుల వివరాల నమోదు, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ పట్ల బిస్వ భూషణ్ పృష్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్‌ను బిస్వ భూషణ్ పృష్టి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ కమిషనర్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐకే1ఏ, ఓసీ గ్రూప్ ఏజెంట్ ఏవీ రెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ సుమలత, డీజీఎం అనిల్ కుమార్ పాల్గొన్నారు.







