ఆర్.కె న్యూస్, వేమనపల్లి: మండలంలోని రైతులు పండించిన మొక్కజొన్నలకు రూ. 2400 గిట్టుబాటు ధర ఉండి రైతులు ఆర్థికంగా లాభం పొందాలని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభించినట్లు మాజీ జడ్పీటీసీ ఆర్. సంతోష్ కుమార్ తెలిపారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పీఏసీఎస్ కార్యదర్శి రాజ్ నాయక్, స్థానిక సర్పంచ్ చెన్నూరి సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, డీసీసీ జెనరల్ సెక్రటరీ గాలి మధు, తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఎక్కువగా మొక్కజొన్నను పండిస్తున్నారని దానికి మద్దతు ధర ఉండి రైతులు ఆర్థికంగా లాభం పొందాలని ఉద్దేశంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లి మంచిర్యాల జిల్లాలోనే నీల్వాయిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అడగగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు ఈ ప్రాంత ప్రజల తరుపున కృతజ్ఞతలు అన్నారు. రైతులు మధ్య దళారల చేతిలో మోసపోకూడదని ఉద్దేశంతో ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని దీనిని ప్రతి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార సంఘం బ్యాంకు మేనేజర్ లక్ష్మి నారాయణ, క్యాతనపల్లి సర్పంచ్ పున్నం, ఉప సర్పంచ్ కయిత శోభ తిరుపతి, ఒడిల రాజన్న, లింగాగౌడ్, వినోద్ రెడ్డి, చెన్నూరి పురుషోత్తం, మంత్రి రమేష్, తదితరులు పాల్గొన్నారు.
11







