- ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్
- శ్రీరాంపూర్‌లో ఆర్.కె-7 గని కార్మికుల క్రికెట్ పోటీలు ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగుల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, ఐక్యత పెంపొందించడంలో క్రీడలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఐఎన్‌టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర మినిమమ్ వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి. జనక్ ప్రసాద్
అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి ఆర్.కె-7 గని కార్మికుల వన్ డే క్రికెట్ పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఎన్‌టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు సారథ్యంలో ఈ పోటీలు జరిగాయి. బి. జనక్ ప్రసాద్ స్వయంగా బ్యాటింగ్ చేసి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సింగరేణి అభివృద్ధికి ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండటం అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. యువ క్రీడాకారులు కోల్ ఇండియా, జాతీయ స్థాయిల్లో రాణించేందుకు పూర్తి సహకారం అందిస్తామని బి. జనక్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఐఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో అన్ని ఏరియాల్లో రీజియన్ వారీగా, కంపెనీ స్థాయిలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్య సేవలు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని వివరించారు. క్రీడాకారులకు అవసరమైన యూనిఫామ్స్, మెటీరియల్స్, సదుపాయాల మెరుగుదలకు యూనియన్ కృషి చేస్తుందని వెల్లడించారు. సంస్థ ఉద్యోగుల సంక్షేమానికి ఐఎన్‌టీయూసీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. కార్మికులు జట్టు భావనతో క్రీడా స్ఫూర్తిని చాటాలి” అని బి. జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు. అనంతరం విజేతలైన ఆర్.కె-7 గని సి రిలే జట్టు, ఇంజనీరింగ్ సెక్షన్ జట్టుకు ట్రోఫీలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ భీమ్ రావు, కలవేని శ్యామ్, గరిగస్వామి, పి తిరుపతి రాజు, భీమ్ రవి, ప్రవీణ్, జీవన్ రావు తో పాటు ఆర్.కె-7 గని అన్ని షిఫ్టుల నాయకులు పాల్గొన్నారు.







