పిల్లల భవిష్యత్తు కోసం కుల మత ప్రాంత భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాలి

  • ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య
  • శ్రీరాంపూర్‌లో మల్లేపల్లి లక్ష్మయ్య, జయ దంపతులకు ఘనంగా పౌర సన్మానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: పిల్లల భవిష్యత్తు కోసం కుల మత ప్రాంత భేదాలను పక్కన పెట్టి ఐక్యంగా ఉద్యమించాలని ప్రముఖ సామాజిక ఉద్యమ నేత, సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య పిలుపునిచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలోని స్థానిక ఫంక్షన్ హాల్‌లో ఆదివారం బీసీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలు, మూవ్‌మెంట్ 21 ఆర్ట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మల్లేపల్లి లక్ష్మయ్య, మాతా రమాబాయి అంబేద్కర్ అవార్డు గ్రహీత మల్లేపల్లి జయ దంపతులకు ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. సామాజిక మార్పు కోసం వారు చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ వివిధ సంఘాల ప్రతినిధులు వారిని సత్కరించారు. భవిష్యత్తులో సాధారణ ప్రజల జీవనం మరింత కష్టతరం కానుందని మల్లేపల్లి లక్ష్మయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే తరాల మనుగడ కోసం అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. సమాజ మార్పు కోసం తన కలం ద్వారా చైతన్యాన్ని నింపుతూ, తన ఆలోచనలతో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న మల్లేపల్లి లక్ష్మయ్య జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. మల్లేపల్లి జయ సామాజిక రంగంలో అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్వోటు జీఎం, బీసీ లైజన్ ఆఫీసర్ ఎన్. సత్యనారాయణ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో దలిత్ బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ కె. శ్యామలాదేవి, సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. ప్రవీణ్ కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి సంకే రవి, సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అంతోటి నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకుడు ముస్కె సమ్మయ్య, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, బీసీ ఉద్యోగుల సంఘం నాయకుడు జి. శ్రీనివాస్, ఎస్సీ, ఎస్టీ నాయకులు డేగల ప్రవీణ్, దారావత్ రాజేష్, నెలబోయిన కుమార్ హాజరయ్యారు. ఎస్సీ లైజన్ ఆఫీసర్ కె. ఆనంద్ కుమార్, ఎస్టీ లైజన్ ఆఫీసర్ గుండె రావు, బద్రి బుచ్చయ్య, ఐఎన్‌టీయూసీ నాయకుడు కలవేని కుమారస్వామి, టీజీబీకేఎస్ నాయకులు బడికల సంపత్, పెట్టేం లక్ష్మణ్ తదితరులు తమ సంఘాల తరపున పాల్గొన్నారు. కళాకారులు, యువత, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment