- బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య
- నస్పూర్‌లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించే దిశగా కృషి చేయాలని బీఆర్ఎస్ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య పిలుపునిచ్చారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం నస్పూర్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. స్వాతంత్ర్య సమరంలో జగ్జీవన్ రామ్ చూపిన త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం మరువలేనివని కొనియాడారు. సమానత్వం, న్యాయం, సేవ అనే విలువలు నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అక్కూరి సుబ్బన్న కోరారు. దళితుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్ కుమార్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, టీబీజీకేఎస్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్, మాజీ కౌన్సిలర్ వంగ తిరుపతి, నాయకులు ఆకునూరి సంపత్, రుకుం తిరుమల్, జాడి భానుచందర్, కాటం రాజ్ కుమార్, కందుల ప్రశాంత్, నోముల నరేందర్ రెడ్డి, ఇరుగురాల వంశీ, ఒడ్డే వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.







