కార్మికుల షిఫ్ట్ సమయాలు మార్చాలి: ఏఐటీయూసీ

శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్‌కు వినతిపత్రం అందజేత

నస్పూర్, ఆర్.కె న్యూస్: తీవ్రమైన వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా ఓపెన్ కాస్ట్ గనుల్లో పనిచేసే కార్మికుల షిఫ్ట్ సమయాలను మార్చాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం శ్రీరాంపూర్ ఓసీపీ మేనేజర్‌కు యూనియన్ ప్రతినిధులు ఒక వినతిపత్రాన్ని అందజేశారు. పెరుగుతున్న ఎండల వల్ల కార్మికుల ఆరోగ్యం, భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కందికట్ల వీరభద్రయ్య, బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య మాట్లాడుతూ ఓపెన్ కాస్ట్ కార్మికులు విధినిర్వహణలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. యాజమాన్యం స్పందించి అన్ని పని ప్రదేశాలలో చల్లని తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. ఎండల తీవ్రత తగ్గే వరకు పని వేళల్లో తగిన విశ్రాంతి విరామాలు ఇవ్వడంతో పాటు అవసరమైన చోట్ల తాత్కాలిక షెడ్లు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాచర్ల చంద్రమోహన్, అఫ్రోజ్ ఖాన్, నాగభూషణం, గండి సతీష్, నల్లపు సత్తయ్య, వెంకటరెడ్డి, పెద్దయ్య, మల్లెత్తుల శ్రీనివాస్ పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment