వర్షానికి విరిగిపడిన చెట్లు, కూలిన ఇల్లు: తక్షణమే స్పందించిన కార్పొరేటర్ అగ్గు సాగర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 34వ డివిజన్‌లో మంగళవారం ఉదయం కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల విద్యుత్ స్తంభాలపై చెట్లు విరిగిపడటంతో పాటు ఒక ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అగ్గు సాగర్, వార్డు అధ్యక్షుడు పెంచాల వేణు, నాయకుడు బైరం ప్రభాకర్, ఇతర స్థానిక నేతలతో కలిసి వెంటనే క్షేత్రస్థాయికి చేరుకున్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి, విద్యుత్ స్తంభాలపై పడిన చెట్ల కొమ్మలను తొలగింపజేశారు. ఇల్లు కూలిపోయిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. డివిజన్ పరిధిలో వర్షం వల్ల ఉత్పన్నమైన విద్యుత్, పారిశుద్ధ్య సమస్యలను తక్షణమే పునరుద్ధరించి, ప్రజలకు ఎలాంటి తీవ్ర ఇబ్బందులు కలగకుండా స్థానిక నాయకులు, సిబ్బందితో కలిసి సమస్యలను పరిష్కరించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment