సోన్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం
సోన్, ఆర్.కె న్యూస్: మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును త్వరితగతిన పరిష్కరించాలని సోన్ ఎంపీడీవో రామకృష్ణ అధికారులను ఆదేశించారు. సోమవారం సోన్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ప్రజావాణిలో రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీ నిర్మాణ పనులకు సంబంధించి మొత్తం మూడు దరఖాస్తులు స్వీకరించినట్లు ఎంపీడీవో తెలిపారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖల ద్వారా పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్ కుమార్, డాక్టర్ విజయ్ కుమార్ లతో పాటు మండలంలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.







