జీవో నెం. 97ను రద్దు చేయాలని కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సచివాలయ ముట్టడి: విద్యార్థి సంఘాల హెచ్చరిక

నస్పూర్, ఆర్.కె న్యూస్: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెం. 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని కలెక్టరేట్ ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు భారీ శాంతియుత ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు ఏఐఎస్‌బి, పీడీఎస్‌యు, యూఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టరేట్ పరిపాలనాధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి కార్యక్రమం, జీవో నెం. 97 వల్ల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ చేరాలనుకునే విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డిప్లొమా చదివిన విద్యార్థులు తిరిగి ఇంటర్మీడియట్ చేయాల్సి రావడం వల్ల వారి మూడేళ్ల విలువైన విద్యాకాలం వృథా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్లొమా కోర్సులను ఐటీఐ, ఏటీసీలతో అనుసంధానించడం వల్ల పాలిటెక్నిక్ విద్యకున్న ప్రత్యేకత దెబ్బతింటుందన్నారు. సాంకేతిక విద్యా మండలి స్వయంప్రతిపత్తిని కాపాడాలని, డిప్లొమా విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలను యథావిధిగా కొనసాగించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండివైఖరి వీడి జీవో నెం. 97ను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకుని హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని నాయకులు హెచ్చరించారు. విద్యా రంగంలో మార్పులు చేసే ముందు నిపుణులు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌బి జిల్లా అధ్యక్షుడు ఢీకొండ జతిన్ గౌడ్, జిల్లా కార్యదర్శి కనుకుంట్ల సన్నీ గౌడ్, పీడీఎస్‌యు జిల్లా కార్యదర్శి డి. శ్రీకాంత్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి, ఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నీరటి రాంప్రసాద్, నాయకులు సికిందర్, కార్తీక్, ఈశ్వర్, విద్యార్థినులు సాధన, అక్షిత, విద్యార్థులు అఖిల్, మోహిన్ ఖాన్‌తో పాటు సుమారు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment