సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలం కడ్తాల్ గ్రామంలోని స్మశానవాటిక వద్ద నీటి వసతి సరిగా లేక గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం లభించింది. స్మశానవాటికలో అంత్యక్రియల సమయంలో స్నానాలు చేసేందుకు నీరు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు సర్పంచ్ గుర్రం రాము దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల సమస్యపై వెంటనే స్పందించిన సర్పంచ్ స్మశానవాటిక వద్ద నూతన పైప్ లైన్ తో పాటు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేయించారు. గతంలో ఏర్పాటు చేసిన పైప్ లైన్, వాటర్ ట్యాంక్ పూర్తిగా దెబ్బతినడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో అంత్యక్రియల సమయంలో స్నానాలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని నూతన పైప్ లైన్ ఏర్పాటు చేసి, వాటర్ ట్యాంక్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించిన సర్పంచ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
4







