సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజానికి ఆయన చేసిన సేవలను, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. ఈ నివాళి కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మొయినుద్దీన్, ఆత్మ డైరెక్టర్ గాండ్ల లింగన్న, మాజీ వైస్ ఎంపీపీ మురళీధర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వినోద్ , మహమ్మద్ అబూద్, అజహర్, జగన్, అనిల్, దాసరి రాజేశ్వర్, ప్రసాద్, దేవేందర్, నీరటి చిన్నయ్య, ప్రదీప్ , కొంతం అమృత్, కొంతం గంగాధర్, సుధాకర్, రిజ్వాన్,రాజేందర్ మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.
22







