నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు
సోన్, ఆర్.కె న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఓటరు జాబితా సమగ్ర సవరణ (SIR) కార్యక్రమం విజయవంతం చేయాలని నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు అన్నారు. సోన్ మండల పరిధిలోని పాక్పాట్ల, సాకేరా గ్రామాల్లో జరుగుతున్న ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల ప్రక్రియ తీరును ఆయన గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా స్థానిక నాయకులు, బూత్ స్థాయి ప్రతినిధులతో కలిసి కార్యక్రమం జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. శ్రీహరి రావు మాట్లాడుతూ, 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ యువకుడు ఓటరుగా నమోదయ్యేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. జాబితాలో తప్పులు లేకుండా, అర్హులైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక బాధ్యులను ఆదేశించారు. ఓటరు గుర్తింపు కార్డులలో మార్పులు, చేర్పుల ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎవరికైతే ఎస్ఐఆర్ నోటీసులు వచ్చాయో వారు బి ఎల్ ఓ లకు తగిన ధ్రువపత్రాలు సమర్పించి ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. పాక్ పట్ల గ్రామంలో అధిక మొత్తంలో నోటీసులు రావడం జరిగిందని అందుకు బి ఎల్ వోలు, కార్యకర్తలు ఓటర్లకు తగు అవగాహన కల్పించి ఓటు హక్కు కోల్పోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ సోమ భీంరెడ్డి, సోన్ మండల అధ్యక్షుడు మొయినుద్దీన్, మధుకర్ రెడ్డి, రమేష్ రెడ్డి, ఉదయ్ కుమార్, గుర్రం రాము, గాజుల రవికుమార్, శ్రీనివాస్ గౌడ్, అజహర్, జగన్, ప్రేమ్, రాజారెడ్డి, ఎల్చల్ గంగారెడ్డి, ప్రసాద్, కుమ్మరి లింగన్న , రాము తదితర పార్టీ నాయకులు,కార్యకర్తలు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.







