జీడీపీ పెరుగుదల సామాన్య ప్రజల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు?

  • ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలి
సీపీఐ, ఏఐటీయూసీ నేతలు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు పిలుపు

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: జీడీపీ పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఆ పెరుగుదల సామాన్య ప్రజల జీవితాల్లో ఎందుకు కనిపించడం లేదు? అని సీపీఐ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు రామడుగు లక్ష్మణ్, మేకల దాసు ప్రశ్నించారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్‌లో నిర్వహించనున్న ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల పోస్టర్, లోగోను శనివారం మంచిర్యాల ఐబీలో ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ప్రభుత్వ రంగాన్ని బలహీనపరుస్తూ కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతోందని విమర్శించారు. దేశ సంపదను సృష్టించే కార్మికులు, రైతుల ప్రయోజనాలను పక్కనపెట్టి బడా వ్యాపారులకు అనుకూలమైన విధానాలను రుద్దుతోందని మండిపడ్డారు. జీడీపీ గణాంకాల పెరుగుదల మాత్రమే దేశ ప్రగతికి నిదర్శనం కాదని, ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధని నేతలు స్పష్టం చేశారు. దేశంలో జీడీపీ పెరుగుతుంటే నిరుద్యోగ సమస్య ఎందుకు తీవ్రమవుతోందని, కార్మికుల వేతనాలు, ఉద్యోగ భద్రతతో పాటు రైతుల ఆదాయాలు ఎందుకు మెరుగుపడటం లేదని నిలదీశారు. ప్రజల ఉపాధి అవకాశాలు, వేతనాల పెంపు, సామాజిక భద్రత కల్పించినప్పుడే అసలైన ఆర్థికాభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటాలు చేస్తోందని వివరించారు. కరీంనగర్‌లో జరగనున్న రాష్ట్ర మహాసభలను కార్మికులు, ఉద్యోగులు, రైతులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఖలీందర్ అలీఖాన్, జోగుల మల్లయ్య, మిట్టపల్లి పౌలు, లింగం రవి, కొట్టే కిషన్ రావు, వనం సత్యనారాయణ, మిర్యాల రాజేశ్వర్ రావు, చాడా మహేందర్ రెడ్డి, కాదండి సాంబయ్య, ఎగుడ మొండి, పానుగంటి సత్యనారాయణ, మండ యాదగిరి, బియ్యాల రాజేశం పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment