దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి ఉపాధ్యాయుడికే ఉంది

మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్

ట్రస్మా ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో విలువ ఉందని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు కుటుంబ పరిస్థితులను, సమాజాన్ని మార్చే శక్తి, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి కేవలం ఒక ఉపాధ్యాయునికే ఉందని మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ట్రస్మా మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నస్పూర్ పట్టణంలోని ఎంఎం గార్డెన్‌లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ప్రైవేట్ ఉపాధ్యాయులకు మెడ్‌లైఫ్ ఆసుపత్రిలో వైద్య చికిత్సల్లో రాయితీ కల్పించడం అభినందనీయమని మేయర్ ప్రశంసించారు. డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఇలా ఏ రంగంలో ఉన్నవారినైనా తీర్చిదిద్దే మూలశక్తి గురువేనని మండల విద్యాశాఖ అధికారి చౌదరి తెలిపారు. కొవ్వొత్తిలా కరిగిపోతూ సమాజానికి వెలుగులు పంచుతూ నవ సమాజాన్ని నిర్మిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులను ఏటా గుర్తించి సత్కరిస్తున్నామని ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం మంచిర్యాల మెడ్‌లైఫ్ ఆసుపత్రితో సమన్వయం చేసుకుని వైద్య సేవలపై రాయితీ కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడ్‌లైఫ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి-లింగయ్య, ట్రస్మా జిల్లా గౌరవ అధ్యక్షుడు బత్తిని దేవన్న, కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి, ట్రెజరర్ కృష్ణారెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల అధ్యక్షుడు మైదం రామకృష్ణ, కార్యదర్శి ఉట్ల సత్యనారాయణ, కోశాధికారి అంబాల రాజకుమార్, ఉపాధ్యక్షుడు అమన్ ప్రసాద్, సత్యనారాయణ రెడ్డి, జుల్ఫికర్, కరస్పాండెంట్లు రమేష్, ప్రణయ్, స్రవంతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment