12
సోన్, ఆర్.కె న్యూస్: సోన్ మండలంలో ఈ ఏడాది జరగనున్న గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని సోన్ పోలీస్ స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సోన్ ఎస్ఐ కే. గోపి ఆధ్వర్యంలో, పోలీస్ అధికారులు, డిప్యూటీ ఎంఆర్ఓ సమక్షంలో జరిగిన సమావేశంలో తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ శాఖ సూచనలు, నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని అధికారులు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని సూచించారు.







