ఉద్యోగ బాధ్యతల్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా నూతన సెక్యూరిటీ ఆఫీసర్‌గా నియమితులైన హనుమాన్ గౌడ్‌ను శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కాలరీస్ బీసీ, ఓబీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ నాయకులు ఆయనను పూలబొకే, శాలువాతో సత్కరించి, ఉద్యోగ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సమ్మయ్య, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, బ్రాంచ్ కార్యదర్శి మారుతి, బద్రి బుచ్చయ్య మాట్లాడుతూ.. బీసీ ఉద్యోగుల్లో చైతన్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ప్రతిభ, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని, తోటి కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని సూచించారు. నూతన ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టిన హనుమాన్ గౌడ్ తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల పట్ల సహకార భావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బీసీ అసోసియేషన్ కోశాధికారి మల్లేష్, నాయకులు సాంబయ్య, ఎస్‌అండ్‌పీసీ విభాగ కార్యదర్శి కారుకూరి స్వామి, శ్రీనివాస్, పిట్ కార్యదర్శులు వినోద్, మనోజ్, సందీప్, సత్యనారాయణ, లక్ష్మయ్య, ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.







