సీసీసీ నస్పూర్ ఎస్సైగా ఎండీ తహిసీనుద్దీన్ బాధ్యతల స్వీకరణ

శాంతిభద్రతల పరిరక్షణకే మొదటి ప్రాధాన్యత: నూతన ఎస్సై

నస్పూర్,ఆర్.కె న్యూస్: సీసీసీ నస్పూర్ సబ్ ఇన్‌స్పెక్టర్‌గా 2014 బ్యాచ్‌కు చెందిన ఎండీ తహిసీనుద్దీన్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. రామగుండం కమిషనరేట్ ఐటీ కోర్ విభాగం నుంచి బదిలీపై ఆయన ఇక్కడికి వచ్చారు. కాగా, ఇప్పటివరకు ఇక్కడ ఎస్సైగా విధులు నిర్వర్తించిన మేకల ప్రశాంత్ తాళ్లగురిజాలకు బదిలీ అయ్యారు. బాధ్యతల స్వీకరణ అనంతరం నూతన ఎస్సై తహిసీనుద్దీన్ మాట్లాడుతూ.. ఠాణా పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై, శాంతికి భంగం కలిగించేవారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి సమస్యలు చెప్పుకోవచ్చని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను నిబంధనలకు లోబడి, డీజేలు లేకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మండళ్ల నిర్వాహకులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనదారులు విధిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరిస్తూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై తహిసీనుద్దీన్‌కు పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సిబ్బంది సమష్టిగా పనిచేసి ఠాణాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment