శ్రీరాంపూర్ పోచమ్మ దేవాలయంలో ఘనంగా శాంతి హోమం

అమ్మవారి పునఃప్రతిష్ఠాపన 41వ మండల కాలం వేడుకలు
పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేసిన భక్తులు.. అనంతరం అన్నదానం

నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ వాటర్ ట్యాంక్ ఏరియాలోని పోచమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ 41వ మండల కాలం వేడుకల్లో భాగంగా శనివారం శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు, కార్పొరేటర్ బండారి సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షుడు అర్కాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేద పండితులు బుడి అనుదీప్ శర్మ, సుబ్బ అభిషేక్ శర్మల పౌరోహిత్యంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి విశేష రుద్రాభిషేకాలు, అర్చనలు జరిపి, లోక కళ్యాణార్థం పూర్ణాహుతితో శాంతి హోమాన్ని పూర్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ, వాటర్ ట్యాంక్ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి రాసమల్ల దేవేందర్, ఉపాధ్యక్షుడు గడ్డల మధుకర్, కమిటీ సభ్యులు బోడ రాజేష్, అశోక్, గుమ్మడి తిరుపతి, జవాడి సాంబయ్య, మండ సురేష్, వీరయ్య, మొగిళి తిరుపతి, సామ రఘుపతి, పోగుల భీమయ్య, పాలగాని సురేష్, అల్లోజు రమేష్, కుందారపు సురేష్, పోతునూరి శివప్రసాద్, మహేందర్, రణదీప్, లక్కెపరం రవి, రంగన్న తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment