ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య
ఆర్.కె-5 గనిలో ఏఐటీయూసీలోకి భారీగా చేరికలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల హక్కులు కేవలం మాటలతో రావు, నిరంతర రాజీలేని పోరాటాల ద్వారానే వాటిని సాధించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ-ఎస్‌సీడబ్ల్యూయూ) అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య స్పష్టం చేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) శ్రీరాంపూర్ బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం ఆర్.కె-5 పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగరావు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్కే-5 గనికి చెందిన 104 మంది యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరగా, యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ జనరల్ సెక్రెటరీలు
కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ బాజీ సైదా, వైస్ ప్రెసిడెంట్ కొట్టే కిషన్ రావు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ మోత్కూరి కొమురయ్య తదితరులు వారికి ఎర్ర కండువాలు కప్పి యూనియన్‌లోకి ఘనంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ.. ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా ఎన్నికైన నాటి నుంచి కార్మిక సంక్షేమమే ధ్యేయంగా సేవ్ సింగరేణి జాతా, హెడ్ ఆఫీస్ ముట్టడి, సమ్మె నోటీసు వంటి అనేక ఉద్యమ కార్యాచరణలను చేపట్టిందన్నారు. సమ్మె నోటీసు నేపథ్యంలో రీజనల్ లేబర్ కమిషనర్ ఎదుట పలు దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగానే 24 ప్రధాన డిమాండ్లపై యాజమాన్యంతో ఒప్పందాలు సాధించినట్లు వివరించారు. అగ్రిమెంట్లు చేయించేది మనమే.. వాటిని అమలు చేయించే బాధ్యత కూడా మనదే అని, ఒప్పందాలు చేసి చేతులు దులుపుకునే సంఘం ఏఐటీయూసీ కాదని తేల్చిచెప్పారు. కుదిరిన అగ్రిమెంట్ల అమలులో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సింగరేణి మనుగడ యువ కార్మికుల భుజస్కంధాలపైనే ఆధారపడి ఉందని, యువతకు యూనియన్‌లో ప్రాధాన్యతనిచ్చి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. సంస్థ మనుగడకు కొత్త గనుల ఆవశ్యకత ఎంతో ఉందని, కేంద్రం నిర్వహించే వేలంపాటలో యాజమాన్యం చురుగ్గా పాల్గొని కొత్త బ్లాకులను దక్కించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సత్యనారాయణ, తిరుపతి, నాగరాజు, పున్నం చందు, మోహన్, ఎస్‌కే ఇమ్రాన్, ఖాదర్ బాబు, హరికృష్ణ, స్వామి, కృష్ణ, సుధీర్, ప్రశాంత్, సాయి, సంతోష్, సతీష్, వరుణ్, రామకృష్ణ, కళ్యాణ్, విద్యాసాగర్, సుధాకర్, శంకర్, తిరుపతి, సారయ్య, శ్యామ్, వంశీ, రవీందర్, ఎల్. రమేష్, మహిళా కార్మికులు మహేశ్వరి, రాజేశ్వరి, రజిత సహా మొత్తం 104 మంది కార్మికులు యూనియన్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ స్టాఫ్ వైస్ ప్రెసిడెంట్ అడ్డూ శ్రీనివాస్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, మీడియా అధికార ప్రతినిధి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు మాడగోని మల్లేష్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్లు శేఖర్ రావు, ప్రవీణ్, సత్యనారాయణ, నాయకులు జీపీ రావు, రెడ్డిపాక లక్ష్మణ్, విశ్వనాథరెడ్డి, సుందిళ్ల నరేష్, బండ మధుకర్ రెడ్డి, భోగ మధునయ్య, మహేందర్, రాజమణి, తిరుమల, చైతన్య తదితరులు పాల్గొన్నారు.








