శ్రీరాంపూర్ సీహెచ్‌పీలో స్వచ్ఛతా శ్రమదానం.. పార పట్టి శుభ్రం చేసిన జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్:పరిసరాల పరిశుభ్రతతో పాటు గనులు, కార్యాలయాల్లో పేరుకుపోయిన ఈ-వేస్ట్‌ను సమర్థవంతంగా తొలగించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం, బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సింగరేణి వ్యాప్తంగా స్పెషల్ క్యాంపెయిన్ 6.0 కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఏరియా కోల్ హ్యాం
డ్లింగ్ ప్లాంట్ ప్రాంగణంలో ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీహెచ్‌పీ సందర్శనకు వచ్చిన జీఎం మునిగంటి శ్రీనివాస్ స్వయంగా పార పట్టి కన్వేయర్ బెల్ట్ పరిసరాల్లో పేరుకుపోయిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించి శ్రమదానం చేశారు. జీఎం స్వయంగా రంగంలోకి దిగడంతో సీహెచ్‌పీ అధికారులు, కార్మికులు మరింత ఉత్సాహంతో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఉద్యమాన్ని శ్రీరాంపూర్ ఏరియాలో బాధ్యతాయుతంగా అమలు చేయాలన్నారు. అక్టోబర్ 2 నుంచి 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గనులు, విభాగాలలో పేరుకుపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో చేర్చి, వాటిని పూర్తిస్థాయిలో డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సురేష్, సీహెచ్‌పీ ఇన్‌చార్జ్ చంద్రలింగం, పిట్ సెక్రటరీ జిల్లాల రవి, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.







