ఎస్సైగా పదోన్నతి పొందిన పోడేటి వెంకన్న గౌడ్‌కు ఘన సన్మానం

సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ నివాసి పోడేటి వెంకన్న గౌడ్ ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొంది సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బదిలీ అయిన సందర్భంగా ఆదివారం కాలనీలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న-శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, వెంకన్న గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ… జన్నారం సమీపంలోని గోడిశాల అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకన్న గౌడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించి, ఇప్పుడు ప్రతిభతో ఎస్సైగా పదోన్నతి సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నతాధికారుల, ప్రజల మన్ననలు పొందుతూ నిబద్ధతతో విధులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, గోపతి లక్ష్మణ్, గూడ రాజిరెడ్డి, మంచాల రామయ్య, గూడ శ్రీనివాస్, మామిడాల సత్యనారాయణ, సింగ్, చుంచు పోషన్న, గుజ్జ శంకర్, కృష్ణారెడ్డి, బిల్లా రాజయ్య, శ్రీనివాస్ టీచర్, ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్‌రెడ్డి, కె. చంద్రమౌళి, ఎం. రాజయ్య, సుభాష్ రెడ్డి, రిజ్వాన్, అక్కల తిరుపతి, ఏఎస్సై సురేష్ గౌడ్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment