కుటుంబానికి అండగా ఉంటామని మేయర్ దర్ని మధుకర్ భరోసా
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి హబీబ్
బ్రెయిన్ స్ట్రోక్తో హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో మున్సిపల్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హబీబ్ భౌతికకాయానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో హబీబ్ కుటుంబానికి కార్పొరేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, రాచకొండ గోపాల్ రావు, పూదరి సునీత-ప్రభాకర్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.







