తిరుపతి హాస్పిటల్‌లో ‘ఈహెచ్ఎస్’ సేవల పరిశీలన

ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు సద్వినియోగం చేసుకోవాలి: టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని తిరుపతి హాస్పిటల్‌లో ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు తీరును టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు అందుతున్న నగదు రహిత వైద్య సేవలు, పథకం పనితీరుపై ఆయన ఆరా తీసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉద్యోగుల కోసం స్థానిక తిరుపతి ఆసుపత్రితో పాటు నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఈహెచ్ఎస్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఉద్యోగులెవరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చని, అర్హులైన వారంతా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, జిల్లా కార్యదర్శి బొడ్డు శ్రావణ్ కుమార్, కేంద్ర సంఘ కార్యదర్శులు పొన్న మల్లయ్య, రాగి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మాజీ కార్యదర్శి రామ్మోహన్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సత్యనారాయణ, నరేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ మోసిన్, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment