శాంతిభద్రతల పరిరక్షణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

◼️ హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణలో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆదేశించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్‌లోని హాజీపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, రిసెప్షన్ కౌంటర్‌ను పరిశీలించిన ఆయన ఆవరణను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ సిబ్బందితో మాట్లాడి కేసుల ఆన్‌లైన్ నమోదు, క్రైమ్ రికార్డులు, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిపై ఎస్‌ఐ కిరణ్ కుమార్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవాలని, సమాచార వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. గ్రామాల్లో ప్రజల భద్రత కోసం సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి వాటిని ఏర్పాటు చేయించేలా చూడాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ కిరణ్ కుమార్, స్టేషన్ రైటర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment