కార్మిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా సీహెచ్‌పీలో ఏఐటీయూసీ పిట్ సెక్రటరీగా నూతనంగా ఎన్నికైన జిల్లాల రవిని శ్రీరాంపూర్ బ్రాంచ్ మినిస్ట్రీయల్ వింగ్ ప్రతినిధులు శనివారం ఘనంగా సన్మానించారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో, ఉద్యోగుల సంక్షేమంలో నిరంతరం ముందుండి సేవలందించాలని వారు ఈ సందర్భంగా కోరారు. యూనియన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా రవి కృషి చేయాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఐక్యంగా పనిచేయాలని నాయకులు ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా మినిస్ట్రీయల్ వింగ్ ఇన్చార్జి, జీఎం కమిటీ చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య, ఇంటర్నల్ ఆడిట్ పిట్ సెక్రటరీలు రాజు, రాజశేఖర్, సీహెచ్‌పీ మినిస్ట్రీయల్ వింగ్ సభ్యులు రాకేష్, సురేష్, కిరణ్, యాక్టింగ్ పీఏ శ్రీరాములు శ్రీనివాస్ పాల్గొన్నారు.







