KYATHAM RAJESH
నస్పూర్, ఏప్రిల్ 04 (ఆర్.కె న్యూస్): నస్పూర్ – శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా భూపతి రవి ఎన్నికయ్యారు. గురువారం రాత్రి ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఓటింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా కొండా శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులుగా భాస్కరి రాజేశం, ఉపాధ్యక్షులుగా శ్రీపతి రాములు, మైదం రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా క్యాతం రాజేష్, జాయింట్ సెక్రటరీగా ఏల్పుల మల్లేష్, ఫైనాన్స్ సెక్రటరీగా కేశిరెడ్డి నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గా తలారి సమ్మయ్య, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా కోడం రవి కుమార్ లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు భూపతి రవి మాట్లాడుతూ, నూతన కమిటీ కాల పరిమితి రెండు సంవత్సరాలు ఉంటుందని, ప్రెస్ క్లబ్ పురోభివృద్ధికి, సభ్యుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
- మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్.కె న్యూస్): నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా అవకాశం కల్పిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎస్.సి, ఎస్.టి, బి.సి, మైనారిటీ, ఇతర వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఈ పథకం ద్వారా చేయూత అందించడం జరుగుతుందని, అర్హులైన వారు ఈ నెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 50 వేల రూపాయల లోపు రుణం 100 శాతం మాఫీ, 1 లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం రాయితీ, 1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ, 2 లక్షల రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు 70 శాతం రాయితీ లభిస్తుందని, రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణాల ద్వారా అందించడం జరుగుతుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి రోజు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు. లే అవుట్ క్రమబద్దీకరణలో భాగంగా ఎల్.ఆర్.ఎస్ రుసుము చెల్లింపుదారులకు అవగాహన కల్పించి, సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్.కె న్యూస్):దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మక పథకం అని మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పాత మంచిర్యాల రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద ఇంటికి సన్నబియ్యం చేరాలన్న చారిత్రాత్మక పథకాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఇది చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పథకమని, పేదవారి ఇంట ప్రతిరోజూ పండుగ జరగాలన్న ఆలోచన, పేదవారి కడుపు నింపాలన్న లక్ష్యంతో సన్న బియ్యం పంపిణీ ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు, పాత మంచిర్యాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలి
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఏప్రిల్ 01 (ఆర్ .కె న్యూస్ ): ఉద్యోగులు, అధికారుల సమిష్టి కృషితో 2025-26 ఆర్థిక సంవత్సరానికి శ్రీరాంపూర్ ఏరియా నిర్ధేశించిన 65,16,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సాధిస్తామని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం జీఎం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో విలేకరులతో మాట్లాడుతూ, మార్చి నెలలో ఏరియాలోని గనులు రికార్డు స్థాయిలో 147 శాతం ఉత్పత్తి సాధించాయని, మార్చి 28, 31 తేదీల్లో 10 రేకుల బొగ్గు డిస్పాచ్ చేసినట్లు, డిసెంబర్ నెలలో ఎస్సార్పీ ఓసీపీలో 176 శాతం ఉత్పత్తి సాధించినట్లు, గత ఆర్థిక సంవత్సరంలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 6, ఆర్.కె న్యూ టెక్, ఎస్సార్సీ ఓసీ2 గనులు నూరు శాతానికి పైగా ఉత్పత్తి సాధించడం హర్షణీయమని పేర్కొన్నారు. మార్చి నెలలో ఆర్కే5 గని 103 శాతం, ఆర్.కె 6 గని 106 శాతం, ఆర్.కె 7 గని 102 శాతం, ఆర్.కె న్యూటెక్ గని 115 శాతం, ఎస్సార్పీ 1 గని 67 శాతం, ఎస్సార్పీ 1 గని 87, ఐకే1ఏ గని 82 శాతం ఉత్పత్తితో భూగర్భ గనులు 95 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్సార్పీ ఓసిపి 168 శాతం, ఐకే ఓసిపి 152 శాతం ఉత్పత్తితో శ్రీరాంపూర్ ఏరియాలో 147 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించామని తెలిపారు. ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తికి కృషి చేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏరియాలోని ఆర్.కె 6, ఎస్సార్పీ 1 గనులు మూతపడనున్నట్లు తెలిపారు. ఐకె ఓసీపీలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 3784 మంది అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలు జారీ చేసినట్లు, 278 మంది గైర్హాజరు ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు ఎన్. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
రైల్వేలో జర్నలిస్టుల రాయితీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులలో చాలా వరకు తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గాలకు చెందిన వారేనని, తమ విధి నిర్వహణలో భాగంగా ప్రతినిత్యం రైళ్లలో ప్రయాణాలు చేస్తుంటారన్నారు. ఎంపీ వద్దిరాజు రాజ్యసభలో గురువారం మాట్లాడుతూ, కోవిడ్ కారణంగా ఎత్తేసిన రాయితీ పథకాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వారిపై ఆర్థిక భారం పడకుండా సాయం చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వ శాఖను కోరారు. రైలు ప్రయాణాల సందర్భంగా గతంలో మాదిరిగా 50 శాతం రాయితీని పునరుద్ధరించాల్సిందిగా పాత్రికేయులు, వారి సంఘాలు మూడేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్థంభంగా సమాజానికి తమ విలువైన సేవలందిస్తున్న జర్నలిస్టులకు రైల్వే టిక్కెట్లలో 50 శాతం రాయితీ కల్పించడమనేది సమంజసం, సముచితమని ఎంపీ రవిచంద్ర చెప్పారు.
- ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు
నస్పూర్, మార్చి 27 (ఆర్.కె న్యూస్): కార్మికవర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మే 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు కార్మికవర్గం సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు అన్నారు. గురువారం శ్రీరాంపూర్ లో జరిగిన మంచిర్యాల జిల్లా సివిల్ సప్లై హమాలీ యూనియన్ సమావేశానికి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, 44 కార్మిక చట్టాలను 4 కోడ్ లుగా మార్చి, ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో మే 20న దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని కార్మికవర్గాన్ని కోరారు. దేశంలో కార్మిక వర్గానికి హక్కులు లేకుండా కార్పొరేట్ అనుకూల శక్తులకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని, కార్మిక చట్ట సవరణలకు వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు, ఉపాధ్యక్షులు మిట్టపల్లి పౌలు, సివిల్ సప్లై హమాలీ కార్మికులు పానుగంటి సత్యనారాయణ, తిప్పని సత్తయ్య, పోరండ్ల సంపత్, నరేష్, రాజన్న, మామిడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, మార్చి 25 (ఆర్.కె న్యూస్): నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గ మాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దేవాలయ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షుడు సిరిపురం రామన్న, ప్రధాన కార్యదర్శి కొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు చిప్ప రాజబాబు, తౌటం మల్లేష్, కుంట రామన్న, ఆడేటి రాజన్న, మెండె వెంకన్న, కుందారపు రాములు, కుందారపు రమేష్, సాంబయ్య, కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
నస్పూర్, మార్చి 23 (ఆర్.కె న్యూస్): రాజకీయాలు, గెలుపోటములకు అతీతంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి నస్పూర్ పట్టణంలోని ఏవి ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని, ఉగాది పండుగ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు, అర్హులైన లబ్ధిదారులకు అతి త్వరలో నూతన తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నట్లు, మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 1500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కమీషన్ల కొరకు ఎవరైనా వేధిస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని, 3 నెలల్లో సింగరేణి భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని అవాంతరాలు సృష్టించిన మంచిర్యాలలో అభివృద్ధి ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో హిందూ, ముస్లిం, క్రిష్టియన్లు అందరూ సమానమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిళ్ళ వేణు, నాయకులు నూకల రమేష్, భూపతి శ్రీను, తిరుపతి, కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గామాత దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 25న నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు సిరిపురం రామన్న, కొండా శ్రీనివాస్ లు తెలిపారు. ఆదివారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ఉదయం 9 నుంచి గంటలకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ మహోత్సవానికి నస్పూర్ పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముఖ్య సలహాదారు చిలువేరు శరవంధం, ఉపాధ్యక్షులు చిప్ప రాజబాబు, దేవసాని నాగరాజు, తౌటం మల్లేష్, పద్మశాలి సంఘం మహిళా అధ్యక్షురాలు బండి పద్మ, సూరం శ్రీనివాస్, కోడూరి వెంకటేష్, మెండే వెంకన్న, కుంట రామన్న తదితరులు పాల్గొన్నారు.