ఆర్.కె న్యూస్, నస్పూర్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నస్పూర్ పట్టణంలోని శ్రీలక్ష్మి గణేష్ మండలి వద్ద అర్చకులు సముద్రాల వెంకట రమణాచార్యుల ఆధ్వర్యంలో సామూహిక కుంకుమార్చన పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కుంకుమార్చన పూజలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ నవరాత్రులను పురస్కరించుకొని శ్రీలక్ష్మి గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. గణపతి బప్పా మోరియా, గణేష్ మహారాజ్ కి జై అనే భక్తుల నినాదాలతో గణేష్ మండపం పరిసరాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు అనుమాండ్ల వెంకట్ రెడ్డి, జక్కినబోయిన గోపాల్, రామగిరి బాలరాజు, క్యాతం రాజేష్, కాటం రామ్ రెడ్డి, టేకుమట్ల అంజయ్య, మండల తిరుపతి, తిరుపతి గౌడ్, రాయమల్లు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- వాస్తవ, నికర లాభాలను తక్షణమే ప్రకటించాలి
- టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎస్.పి ఏసీ ఫంక్షన్ హాల్ ను మంచిర్యాల డీసీసీ ప్రెసిడెంట్ కొక్కిరాల సురేఖ శుక్రవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ యజమానులు సూరపనేని శ్రీనివాస రావు, పోరెడ్డి లక్ష్మా రెడ్డి, భీంరెడ్డి రవీందర్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఫంక్షన్ హాల్ యజమానులు మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సుమిల్ల వేణు, కాంగ్రెస్ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
- ఐ.ఎన్.టి.యు.సి నాయకులు జెట్టి శంకర్ రావు, కాంపెల్లి సమ్మయ్య
- శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ఎదుట ధర్నా
- ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్
- ఆర్.కె న్యూటెక్ గనిపై ఎండీటీ సమావేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇతర పరిశ్రమల నుంచి బొగ్గు తక్కువ ధరలో లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ (ఏజెంట్ ఎస్సార్పీ గ్రూప్) అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గనిపై మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు అధ్యక్షతన మల్టీ డిపార్టుమెంటల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎండీటీ బృంద సభ్యులు సాంబశివరావు (డీజీఎం, ఈ అండ్ ఎం),కె. అమర్నాథ్ (అడిషనల్ మేనేజర్, ఆర్ అండ్ డి ), వి. మహేష్ (అడిషనల్ మేనేజర్, ఎస్టేట్స్), జి. నరేష్ (డీవై ఎఫ్ఎం), వి. దేవేందర్ రెడ్డి (డీవై పీఎం) హాజరయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి ఆర్థిక స్థితిగతులు, సంస్థ ప్రగతిలో ఉద్యోగుల పాత్రపై ఆయా విభాగాల అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యువ ఉద్యోగులు కంపెనీ నాది అనే భావనతో పని చేయాలని తెలిపారు. ప్రతిరోజు తప్పకుండా విధులకు హాజరు కావాలని, గైర్హాజరు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు దృష్టి సారించాలన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి అధికోత్పత్తి సాధించాలని, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసినప్పుడే సంస్థ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గని మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు, గుర్తింపు సంఘం ఏరియా సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, గని రక్షణాధికారి కొట్టె రమేష్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సీనియర్ సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజనీర్ కృష్ణ, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్ పరమేశ్వర్, ఇతర అధికారులు, నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
- నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈ నెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లాలో జరుగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నర్సయ్య భవన్ లో రాష్ట్ర 4వ మహాసభ గోడ పత్రికలను సిపిఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి మాట్లాడుతూ, ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి. రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణలు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు బడా కార్పొరేట్లకు కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిర్యాల రాజేశ్వరరావు, దొడ్డిపట్ల రవీందర్, పూజారి రామన్న, ఇలవేణి సారంగపాణి, బిసి సాధన సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు జోగుల ఆంజనేయులు, బొడ్డు లచ్చన్న, నాయకులు అల్లా లచ్చిరెడ్డి, నాగపురి సమ్మయ్య, ఎండి. రషీద్ తదితరులు పాల్గొన్నారు.
- కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్
- ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యానికి అవగాహన లేదని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని, మారు పేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న 3600 విజిలెన్స్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి, సేవ్ సింగరేణి, సేవ్ వర్కర్స్ అనే నినాదంతో ఈ నెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, ఈనెల 22న 2 వేల మంది కార్మికులతో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని, జాతీయ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ తయారీలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎలక్ట్రోల్ డేటా అడిగితే ఇవ్వడం లేదని, ఈసీని కలవడానికి వెళ్లిన 300 మంది ఎంపీలను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఈవీఎంలు కొనుగోలు చేస్తే అందులో 40 లక్షల ఈవీఎంలు మాత్రమే అకౌంట్ లో ఉన్నాయని మిగతా 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. 2024లో పది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, బెంగళూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మహాదేవపూర్ లో 1,00,250 దొంగ ఓట్లు ఉన్నాయని, ఒకే వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు, తండ్రి పేరు అడ్రస్ లేకుండా ఎన్నో దొంగ నోట్లు ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎలక్షన్ కమిషన్ వైఖరిని నిర్వహిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామిశెట్టి నరేందర్, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ భూమన్న, జనరల్ సెక్రటరీ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగ స్వామి, జీవన్ జోయల్, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ తిరుపతి రాజు, సెంట్రల్ సెక్రటరీలు మెండె వెంకన్న, అశోక్, వివిధ గనుల పిట్ సెక్రటరీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
- బిఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో మితిమీరిన రాజకీయ జోక్యంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందని బిఎంఎస్ జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి సంస్థను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన 37 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. సింగరేణి యాజమాన్యానికి ఉత్పత్తి మీద ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ మీద లేదని, సింగరేణి జరుగుతున్న ప్రమాదాలకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. సింగరేణిలో 70 శాతం, కోల్ ఇండియాలో 80 శాతం బొగ్గు ఉత్పత్తి కాంట్రాక్టు కార్మికుల వల్లనే వస్తుందని, సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించడం లేదని, కాంట్రాక్టు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కాంట్రాక్టు కార్మికులకు బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం ఏర్పాటు చేయాలని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు వైద్యం అందించాలని, ఖాళీగా ఉన్న క్వార్టర్లు కాంట్రాక్టు కార్మికులకు పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించాలని అన్నారు. లేబర్ కోడ్ లపై కొన్ని కార్మిక సంఘాలు ఉద్దేశ్యపూర్వకంగా గందరగోళం చేస్తున్నాయని, 4 లేబర్ కోడ్ లలో 2 లేబర్ కోడ్ లు కార్మికులకు అనుకూలంగా ఉన్నాయని, మిగతా రెండు కోడ్ లపై చర్చిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ నాయకులు మండ రమాకాంత్, పులి రాజారెడ్డి, యాదగిరి సత్తయ్య, సారంగపాణి, హరీష్, దుర్గం రమేష్, మద్దూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
- పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సింగరేణి ఉద్యోగి రాజ్ కుమార్