సింగరేణి విశ్రాంత ఉద్యోగులు, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీ నివాసి పోడేటి వెంకన్న గౌడ్ ఏఎస్సై నుంచి ఎస్సైగా పదోన్నతి పొంది సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బదిలీ అయిన సందర్భంగా ఆదివారం కాలనీలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి 51వ డివిజన్ కార్పొరేటర్ నీలి స్వప్న-శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, వెంకన్న గౌడ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ… జన్నారం సమీపంలోని గోడిశాల అనే మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకన్న గౌడ్ కానిస్టేబుల్ స్థాయి నుంచి హెడ్ కానిస్టేబుల్, ఏఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించి, ఇప్పుడు ప్రతిభతో ఎస్సైగా పదోన్నతి సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. పోలీస్ శాఖలో చేరిన నాటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి రిమార్క్ లేకుండా ఉన్నతాధికారుల, ప్రజల మన్ననలు పొందుతూ నిబద్ధతతో విధులు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గజెల్లి వెంకటయ్య, గోపతి లక్ష్మణ్, గూడ రాజిరెడ్డి, మంచాల రామయ్య, గూడ శ్రీనివాస్, మామిడాల సత్యనారాయణ, సింగ్, చుంచు పోషన్న, గుజ్జ శంకర్, కృష్ణారెడ్డి, బిల్లా రాజయ్య, శ్రీనివాస్ టీచర్, ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్‌రెడ్డి, కె. చంద్రమౌళి, ఎం. రాజయ్య, సుభాష్ రెడ్డి, రిజ్వాన్, అక్కల తిరుపతి, ఏఎస్సై సురేష్ గౌడ్, భోజన్న తదితరులు పాల్గొన్నారు.




డ్లింగ్ ప్లాంట్ ప్రాంగణంలో ప్రత్యేక పరిశుభ్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. సీహెచ్‌పీ సందర్శనకు వచ్చిన జీఎం మునిగంటి శ్రీనివాస్ స్వయంగా పార పట్టి కన్వేయర్ బెల్ట్ పరిసరాల్లో పేరుకుపోయిన ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించి శ్రమదానం చేశారు. జీఎం స్వయంగా రంగంలోకి దిగడంతో సీహెచ్‌పీ అధికారులు, కార్మికులు మరింత ఉత్సాహంతో శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక ఉద్యమాన్ని శ్రీరాంపూర్ ఏరియాలో బాధ్యతాయుతంగా అమలు చేయాలన్నారు. అక్టోబర్ 2 నుంచి 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని గనులు, విభాగాలలో పేరుకుపోయిన పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డబ్బాల్లో చేర్చి, వాటిని పూర్తిస్థాయిలో డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ సురేష్, సీహెచ్‌పీ ఇన్చార్జ్ చంద్రలింగం, పిట్ సెక్రటరీ జిల్లాల రవి, అధికారులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో మున్సిపల్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. హబీబ్ భౌతికకాయానికి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ శనివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో హబీబ్ కుటుంబానికి కార్పొరేషన్ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని మేయర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సుదమల్ల హరికృష్ణ, రాచకొండ గోపాల్ రావు, పూదరి సునీత-ప్రభాకర్, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని నివాళులర్పించారు.
ఎస్ఆర్పీ-3 గనిలో 309 మంది, ఎస్ఆర్పీ-1 గనిలో 156 మంది మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ యువ కార్మికులు ఏఐటీయూసీలో చేరారు. మంగళవారం మురళీ చౌదరి, దాడి రాజయ్యల అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్‌లలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య, ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ సెక్రెటరీ ఎస్కే బాజీ సైదా, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రెటరీ మోత్కూరి కొమురయ్యలు కార్మికులకు కండువాలు కప్పి యూనియన్‌లోకి ఆహ్వానించారు. గుర్తింపు సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్‌లు మాట్లాడుతూ.. ఏఐటీయూసీ చేపట్టిన సేవ్ సింగరేణి జాతా, హెడ్ ఆఫీస్ ముట్టడి, సమ్మె నోటీసు వంటి ఉద్యమాల వల్లే సమ్మె లేకుండానే ఆర్ఎల్సీ వద్ద 24 ప్రధాన డిమాండ్లపై ఒప్పందం సాధించామన్నారు. సింగరేణి భవిష్యత్తు యువ కార్మికులపైనే ఆధారపడి ఉందని, వారికి యూనియన్‌లో కీలక బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. సంస్థ విస్తరణకు, యువత ఉద్యోగాల కోసం వేలం ప్రక్రియలో యాజమాన్యం చురుగ్గా పాల్గొని కొత్త గనులను దక్కించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ రాచర్ల చంద్రమోహన్, జీఎం చర్చల ప్రతినిధులు బద్రి బుచ్చయ్య, అడ్డు శ్రీనివాస్, సురేష్, జిల్లా కార్యదర్శి అప్రోజ్ ఖాన్, మీడియా అధికార ప్రతినిధి రాజ్ కుమార్, ఎస్ఆర్పీ-3 అసిస్టెంట్ పిట్ సెక్రెటరీలు అంబాల రవి, కారుకూరి నగేష్, వైస్ ప్రెసిడెంట్ తౌటం మల్లేష్, ఎస్సార్పీ-1 అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ పరశురాం తదితరులు పాల్గొన్నారు.
