KYATHAM RAJESH
- గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా
- సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్, రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు అన్నారు. గురువారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా స్థానిక ఆక్స్ ఫోర్డ్ పాఠశాలలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిసి నస్పూర్ ఎస్సై యు. ఉపేందర్ రావు మాట్లాడుతూ, స్కూల్ బస్సు డ్రైవర్లు చిన్నారుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, పాఠశాల వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్ నెస్, పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని, బస్సు సీటింగ్ కెపాసిటీ మేరకు విద్యార్థులను అనుమతించాలని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- జులై నెలలో నూరు శాతం ఉత్పత్తి సాధించడం అభినందనీయం
- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
- ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణానికి చెందిన వంగపెల్లి సహస్ర బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్టు మంచిర్యాల ఎస్ఆర్ డిజి స్కూల్ ప్రిన్సిపాల్ కొడారి కుమారస్వామి తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులు వంగపెల్లి చంద్రశేఖర్, రజితలు కిరణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ డిజి స్కూల్ డీజీఎం లక్ష్మణ రావు, జోనల్ ఇంచార్జ్ అనంతుల శశిధర్, ఉపాధ్యాయులు సహస్రను అభినందించారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని సింగరేణి కాన్ఫరెన్స్ హాల్ లో మంచిర్యాల జోన్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను 2000వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీపీకి పూల మొక్క అందజేసి, శాలువాతో సత్కరించారు. 2000వ సంవత్సరంలో అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ వరంగల్ జిల్లా మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు తాము శిక్షణ పొందినట్లు వారు తెలిపారు. అడిషనల్ డీజీపీ అభిలాష్ బిస్త్ ను కలిసిన వారిలో కానిస్టేబుళ్లు బుద్దె రవి, ఉపేందర్, రాజు, రవి, మల్లా రెడ్డి, చంద్రమోహన్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.