నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇటీవల శ్రీరాంపూర్ డీజీఎం (పర్సనల్)గా బాధ్యతలు స్వీకరించిన ఎస్. అనిల్ కుమార్ ను బుధవారం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు ఆధ్వర్యంలో ఐ.ఎన్.టి.యు.సి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ నాయకులు గరిగ స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, జీవన్ జోయల్, మారేపల్లి బాబు, మెండె వెంకటి, ఏరియా నాయకులు ప్రసాద్, రౌతు సత్యనారాయణ, పి.వెంకటేశ్వర్లు, పూనెం రామకృష్ణ, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
- టీడబ్ల్యూజెఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ అధికారి పిన్న రాజేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడబ్ల్యూజెఎఫ్ మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తోట్ల మల్లేష్ యాదవ్, చింతకింది మధుసూదన్ లు మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేయడం లేదని, జర్నలిస్టులు చాలి చాలని జీతాలతో కాలం వెళ్ళదిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణమే అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు డిమాండ్ చేశారు. అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని స్టిక్కర్లతో పునరుద్ధరించకుండా కొత్త కార్డులు మంజూరు చేయాలని, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందజేయాలని, కరోనా సమయంలో నిలిపివేసిన జర్నలిస్ట్ రైల్వే పాసులను వెంటనే పునరుద్ధరించాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కొరకు త్వరలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జిల్లా కోశాధికారి క్యాతం రాజేష్, ఉపాధ్యక్షులు గొర్రె లక్ష్మణ్, అరికెళ్ల జీవన్ బాబు, నాయకులు అహ్మద్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
- సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
- ఆగస్టు 22, 23వ తేదీల్లో సిపిఐ రాష్ట్ర మహాసభలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక నర్సయ్య భవన్ లో కామ్రేడ్ ఉమా, కామ్రేడ్ చిలుక రామచందర్, కామ్రేడ్ మర్రి సందీప్, కామ్రేడ్ ఎండి అఫ్రోజ్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ నస్పూర్ మండల మూడో మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ తో కలిసి హాజరయ్యారు. షిర్కే సెంటర్ నుండి నర్సయ్య భవన్ వరకు సిపిఐ శ్రేణులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సిపిఐ సీనియర్ నాయకుడు అల్లా లచ్చి రెడ్డి పార్టీ పతాక ఆవిష్కరణ చేశారు. పార్టీ సీనియర్ నాయకులు డికొండ మల్లన్న అమరవీరుల స్థూపానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితుల్లో పాలన కొనసాగిస్తున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల విఫలం అయ్యిందని, ఆరు గ్యారెంటీల్లో మూడు గ్యారంటీలు మాత్రమే అమలు చేసిందని, ఇప్పటికైనా మిగతా మూడు సంక్షేమ పథకాలు అమలు చేయాలని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేసి, చర్చలు జరపాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కమ్యూనిస్టు పార్టీ పోటీ చేస్తుందని, నూతనంగా ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్ అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఆదరించాలని ప్రజలను కోరారు. ఆగస్టు 22, 23వ తేదీల్లో మేడ్చల్ లో రాష్ట్ర మహాసభలు, సెప్టెంబర్ నెలలో పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్ లో జాతీయ మహాసభలు జరుగనున్నట్లు తెలిపారు. సిపిఐ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పాల్గొని రాష్ట్ర, జాతీయ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు ఆహ్వాన సంఘం అధ్యక్షులు మేకల దాస్, కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు రేగుంట చంద్రశేఖర్, కే వీరభద్రయ్య, లింగం రవి, ముస్కె సమ్మయ్య, ఎస్కే బాజీ సైదా, రేగుంట చంద్రకళ, మోత్కూరు కొమురయ్య, ఎండి అఫ్రోజ్ ఖాన్, దొడ్డిపట్ల రవీందర్, మొగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
- సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్ధం కావాలి
- టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవపున్నయ్య
ఆర్.కె న్యూస్, నస్పూర్: జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమేనని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య అన్నారు. శనివారం వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్ లో నిర్వహించిన మంచిర్యాల జిల్లా మూడో మహా సభలో పాల్గొని మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కొత్త సంవత్సరం వచ్చి ఆరు నెలలు కావస్తున్నా అక్రిడిటేషన్ కార్డులకు ఇంకా స్టికర్లు వేస్తూ కాలం వెళ్ళదీస్తున్నారని అన్నారు. పేరుకు హెల్త్ కార్డులు ఇచ్చారని, అవి పనిచేయడం లేదని, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు తదితర సమస్యలపై సంఘం అవిశ్రాంత ఉద్యమాలు చేస్తున్నదని, ప్రస్తుతం జర్నలిస్టులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, చిన్న పత్రికల పరిస్థితి మరీ దారుణంగా ఉందని పేర్కొన్నారు. సంఘ సభ్యులoదరూ ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత జాప్యం చేయడం తగదని, దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించ లేదని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ, సమస్యల పై సమిష్టి పోరాటానికి జర్నలిస్టులు సన్నద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- మంచిర్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా మూడో మహాసభ వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్ లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడిగె బసవపున్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్ హాజరై నూతన కమిటీని ప్రకటించారు. నూతన కమిటీ ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులందరూ ఆమోదించి కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోట్ల మల్లేష్ యాదవ్, కార్యదర్శిగా చింతకింది మధుసూదన్ (ఆంధ్రప్రభ), ఉపాధ్యక్షులుగా చుంచు చందు (వార్త), అరికిల్ల జీవన్ బాబు (బీసీఎన్ న్యూస్ ఛానల్), గొర్రె లక్ష్మణ్ (ఎస్ఎల్ఎన్ న్యూస్ ఛానల్), సంయుక్త కార్యదర్శులుగా బుద్దె రవికుమార్ (వార్త), ఇప్ప రాజ్ కుమార్ (శెనార్తి మీడియా), కోశాధికారిగా క్యాతం రాజేష్ (నేటివార్త), జాతీయ కౌన్సిల్ సభ్యులుగా ముత్యం వెంకటస్వామి (విజయ క్రాంతి), రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా గోపతి సత్తయ్య (వార్త), మేకల ప్రభాకర్ (మన తెలంగాణ), ఆవిడపు వెంకటేష్ (నవతెలంగాణ), సభ్యులుగా ఎం. శేఖర్ (శెనార్తి తెలంగాణ), జాడి వెంకటయ్య (నవతెలంగాణ), నేరెళ్ల సంతోష్ గౌడ్ (నేటి ధాత్రి), కే రామాచారి (నవభూమి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు నూతన కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
- ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రజలకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సేవలు మరింత చేరువ చేయడానికి మంచిర్యాల జిల్లా నస్పూర్ లో ఏసీబీ ఆదిలాబాద్ రేంజ్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ తరుణ్ జోషి తెలిపారు. సోమవారం నస్పూర్ లో ఆదిలాబాద్ రేంజ్ ఏసీబీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మంచిర్యాల పరిసర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో ఫిర్యాదులు రావడం, దూరాభారం కారణంగా ఆదిలాబాద్ లోని ఏసీబీ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి రావడం కారణంగా ఆదిలాబాద్ నుంచి ఏసీబీ రేంజ్ కార్యాలయాన్ని మంచిర్యాలకు మార్చామని, ఆదిలాబాద్ లోని ఏసీబీ కార్యాలయం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. గత 3 సంవత్సరాలుగా అవినీతి నిరోధక శాఖ చాలా చురుకుగా పని చేస్తోందని, కేసుల విచారణలో ఏసీబీ అధునాతన టెక్నాలజీ ఉపయోగిస్తుందని, గత ఏడాది 216 కేసులు, ఈ ఏడాది ఇప్పటివరకు 82 కేసులు నమోదు చేసినట్లు, ఏసీబీ కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అవినీతి ఫిర్యాదుల కోసం ప్రజలు ఏసీబీ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా 1064 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఏసీబీ వెబ్ సైట్ ద్వారా గానీ, మొబైల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. స్వీకరించిన ఫిర్యాదులపై తగు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గతంలో తాను ఉమ్మడి ఆదిలాబాద్ ఎస్పీగా పని చేశానని, జిల్లాపై తనకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఏసీబీ కార్యాలయానికి క్వార్టర్ కేటాయించిన సింగరేణి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రాజేష్ మురళి, రామగుండం కమిషనరేట్ సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్, ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్, కరీంనగర్ ఏసీబీ కోర్ట్ పిపి జ్యోతి, మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, సిసిసి నస్పూర్ ఎస్సై ఉపేందర్ రావు, శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- గ్లోబల్ మున్నూరు కాపు మహాసభ గోడ ప్రతుల ఆవిష్కరణ
- తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణలో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులు ఒకే కులం ఒకే సంఘంగా బలోపేతం అవుదామని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాంలు అన్నారు. గురువారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా గ్రామ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా స్థాయిలో 12 వేల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సంఘంలో సభ్యులుగా ఉన్న వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ ప్రక్రియ ద్వారా కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. బీసీల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులను ప్రభుత్వం తక్కువగా చూపించిందని, బీసీల్లో 18 శాతంగా మొదటి స్థానంలో ఉన్న తమను 5వ స్థానంలో చూపారని ఆరోపించారు. తెలంగాణలో 40 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కుల గణన నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 500 కోట్లు కేటాయించాలని, ప్రోత్సాహక రుణాలు ఇవ్వాలని, మున్నూరు కాపు ఆత్మగౌరవ భవనం నిర్మాణానికి 10 కోట్లు కేటాయించాలని, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మున్నూరు కాపులకు చోటు కల్పించాలని పేర్కొన్నారు. జనాభా ప్రాతిపదికన తమకు వాటా అన్ని రంగాల్లో కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మున్నూరు కాపులకు పటేల్ గా గెజిట్ విడుదల చేయాలన్నారు. అనంతరం అమెరికాలో ఆగస్టు 30, 31 తేదీల్లో జరగనున్న గ్లోబల్ మున్నూరు కాపు సభ గోడ ప్రతులను ఆవిష్కరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపులు ఈ మహా సభలో కలుసుకోనున్నారని, ప్రతి ఒక్కరు కుల సంఘంలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు సంఘం మంచిర్యాల నియోజకవర్గం అధ్యక్షుడు పల్లె భూమేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు గొంగల్ల శంకర్, కన్వీనర్ ఆకుల సత్తన్న, జిల్లా అధికార ప్రతినిధి భాస్కర్ల రాజేశం, నస్పూర్ మండల సమన్వయ కమిటీ సభ్యులు మైదం రామకృష్ణ, గుడాల మల్లేష్, రాళ్ళబండి రాజన్న, పూదరి కుమార్, చెన్నూర్ నియోజకవర్గం ఇంచార్జి బోరిగం వెంకటేశం, నాయకులు బొడ్డు చిన్నయ్య, సమ్మయ్య, విశాల్, కర్నె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ లోని విద్యార్థులకు బుధవారం షీ టీం, భరోసా పై షీ టీం సభ్యులు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఎస్ఐ ఉషారాణి మాట్లాడుతూ, ఆకతాయిల ఆట కట్టించి మహిళలకు రక్షణ కల్పించడం షి టీం కర్తవ్యమని, మహిళలు ఏదైనా సమస్య వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు పై తక్షణమే షీ టీం పోలీసులు స్పందించి సంబంధిత విభాగాలకు సమాచారం అందజేయడం ద్వారా ఫిర్యాదు చేసిన మహిళకు సహాయం అందుతుందని తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు 6303923700 నెంబర్ లో సంప్రదించాలని, అత్యవసర సమయంలో డయల్ 100 లో సంప్రదించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పేర్కొన్నారు. భరోసా సెంటర్ లీగల్ అడ్వైజర్ మాట్లాడుతూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని అన్నారు. సబ్ ఆర్డినేటర్ మాట్లాడుతూ, భరోసా సెంటర్ పని తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో షీ టీం సభ్యులు శ్రవణ్, జ్యోతి, భరోసా సెంటర్ సభ్యులు, పాఠశాల సోషల్ ఆఫీసర్ మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
- శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: కొన్ని కార్మిక సంఘాలు పలు డిమాండ్లతో ఈ నెల 20న తలపెట్టిన ఒక్క రోజు టోకెన్ సమ్మెకు సింగరేణి కార్మికులు దూరంగా ఉండి, విధులకు హాజరై లక్ష్య సాధనకు సహకరించాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఎం. శ్రీనివాస్ కోరారు. బుధవారం జీఎం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, సమ్మె ప్రధాన డిమాండ్లు సింగరేణి పరిధిలో లేనివని, సింగరేణి కార్మికులు ఒక్క రోజు సమ్మె చేస్తే సింగరేణి వ్యాప్తంగా 2 లక్షల టన్నులు, శ్రీరాంపూర్ ఏరియాలో 21 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, సింగరేణి వ్యాప్తంగా కార్మికులు సుమారు 13.07 కోట్ల రూపాయల వేతనాలు కోల్పోతారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్మా అమలులో ఉందని, సమ్మెలు నిషేధమని తెలిపారు. వర్షా కాలంలో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలుగుతుందని, లక్ష్య సాధనకు ఒక్క రోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటు అందిస్తుందని, సింగరేణి ఉద్యోగులు సమ్మెలో పాల్గొనకుండా విధులకు హాజరై బొగ్గు ఉత్పత్తి తమ వంతు కృషి చేయాలన్నారు. విధులకు హాజరయ్యే ఉద్యోగులను ఎవరైనా అడ్డుకుంటే పోలీసుల సహకారం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎం. సత్యనారాయణ, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, సీనియర్ పిఓ పి. కాంత రావు తదితరులు పాల్గొన్నారు.