ప్రత్యేక పూజలు నిర్వహించిన మేయర్ ధర్ని మధుకర్, నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ ఏరియా ఆర్.కె-7, ఆర్.కె న్యూటెక్ గనుల ఆవరణలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం నిర్వహించిన చండీ హోమం కార్యక్రమంలో మంచిర్యాల నగర మేయర్ ధర్ని మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు పుదరి తిరుపతిలతో కలిసి హోమ క్రతువులో పాల్గొన్న అనంతరం, దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మేయర్ ధర్ని మధుకర్ను శాలువాతో ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో మేయర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జగన్మాత దుర్గాదేవి కృపాకటాక్షాలతో సింగరేణి కార్మికులు, ఉద్యోగులతో పాటు మంచిర్యాల నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సకల సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్, ఐఎన్టీయూసీ పిట్ సెక్రటరీలు రౌతు సత్యనారాయణ, మేధరి మహేందర్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పేరం రమేష్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ల్యాగాల శ్రీనివాస్, ఐఎన్టీయూసీ నాయకులు అశోక్, మెండే వెంకన్న, బొలిశెట్టి శ్రీకాంత్లతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గని అధికారులు, ఉద్యోగులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.








