సోన్, ఆర్.కె. న్యూస్: సోన్ మండల కేంద్రంలో కొనసాగుతున్న డిజిటల్ క్రాప్ బుకింగ్ ప్రక్రియను జిల్లా వ్యవసాయ అధికారి సుజాత మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామ వాలంటీర్ల సహకారంతో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నట్లు తెలిపారు. రైతులు తాము సాగు చేసిన పంటలు, రకాల వివరాలను గ్రామ వాలంటీర్లకు అందించి డిజిటల్ క్రాప్ బుకింగ్‌కు సహకరించాలని కోరారు. నమోదు చేసిన పంట వివరాలు పంట ఉత్పత్తుల విక్రయంతో పాటు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సేవలు పొందేందుకు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ రాజశేఖర్‌రెడ్డి, ఏవో వినోద్‌కుమార్, ఏఈవో ఉమామహేశ్వరి, గ్రామ వాలంటీర్ శ్రవణ్, రైతులు రాజేశ్వర్, శ్రీనివాస్, సుమేష్ తదితరులు పాల్గొన్నారు.
15







