7
సోన్, ఆర్.కె న్యూస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా సేవా సంకల్ప అభియాన్ ప్రోగ్రాం నేపథ్యంలో నిర్మల్ జిల్లా ఎస్సీ మోర్చా నేతృత్వంలో సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులను బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాదు ప్రభాకర్, గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్, మండల అధ్యక్షులు మార గంగారెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గంగారపు అమృత్, బీజేపీ నేతలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ పార్టీ నాయకులు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమాజ ఆరోగ్యం పరిశుభ్రత కోసం ప్రతి రోజూ నిరంతరం సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు. వారు అందిస్తున్న పారిశుధ్య సేవల వల్ల ప్రజలు అనేక అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందుతున్నారని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి వారి కృషి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు నరేష్, గంగాధర్, విలాస్, నాయకులు రమేష్, నాగయ్య, నర్సారెడ్డి, శ్రవణ్ రెడ్డి, సాయన్న, సవీన్, ఉదయ్, నరసయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.







