బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మేయర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్‌లో అకాల వర్షం, ఈదురు గాలుల కారణంగా వేల్పుల నరసయ్య ఇంటిపై చెట్టు విరిగిపడి రేకులు పగిలిపోయాయి. స్థానిక కార్పొరేటర్ ద్వారా సమాచారం అందుకున్న మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని నరసయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ప్రమాద వివరాలను తెలుసుకుని బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ సంఘటనపై మేయర్ ధర్ని మధుకర్ మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖలకు ఫోన్ ద్వారా వివరించారు. వారు తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి రూ. 5,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని మేయర్ చేతుల మీదుగా అందజేశారు. గాలుల కారణంగా రహదారులపై, ఇళ్లపై విరిగిపడిన చెట్లను తక్షణమే తొలగించి పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులను మేయర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య, కార్పొరేటర్ అమృత రాజ్ కుమార్, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment