దళిత విద్యార్థుల సేవలకు గుర్తింపు.. ఉదయ్ కిరణ్‌కు ఎమ్మెల్యే అభినందనలు

నస్పూర్ యువకుడి కృషిని కొనియాడిన కొక్కిరాల ప్రేంసాగర్ రావు

నస్పూర్, ఆర్.కె న్యూస్: దళిత విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న నస్పూర్ కు చెందిన కోండ్ర ఉదయ్ కిరణ్ ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అభినందించారు. మహనీయుల జయంతి ఉత్సవాల సందర్భంగా దళిత విద్యార్థులకు ఉదయ్ కిరణ్ అందించిన సేవలకు ఈ గుర్తింపునిచ్చారు. జిల్లా కేంద్రంలో శనివారం ఉదయ్ కిరణ్ ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రశంసించారు. వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఉన్నతికి ఉదయ్ కిరణ్ నిరంతరం శ్రమిస్తున్నారని ప్రేంసాగర్ రావు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. సేవా దృక్పథంతో పనిచేసే యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాదిగ యూత్ సభ్యులు చంద్రగిరి నరేష్, దాసరి విజయ్ సాగర్, కాశిపాక శంకర్, సీపెల్లి రోహిత్, చిలుముల సాయి అశ్వంత్, గడ్డం పృథ్వి, సుద్దాల సురేష్, సురేష్, రవి, అఖిల్, గంగన్న, సంపత్, అజయ్, భరత్ ఇతర నాయకులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment