సొంత ఖర్చులతో నిర్మించి ఇచ్చిన హామీ నెరవేర్చిన మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కెన్యూస్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ రాంనగర్లో గల శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన రెస్ట్ హాల్ ను మేయర్ దర్ని మధుకర్-సుజాత దంపతులు,
కార్పొరేటర్ ఎంబాడి కుమారస్వామితో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో వీరాంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల కోసం సొంత ఖర్చులతో షెడ్ నిర్మిస్తానని ఇచ్చిన మాటను నేడు నెరవేర్చడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులు, మహిళలు, వృద్ధులు ఎండ, వానల సమయంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా విశ్రాంతి తీసుకునేందుకు ఈ షెడ్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఆచరణలో పెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, డివిజన్లలో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రెంక రవి, 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మేయర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.







