- మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్
- శ్యామ్ నగర్, సోనియా నగర్ ఏరియాల్లో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు ఇళ్ల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్ పిలుపునిచ్చారు. సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్ నగర్, సోనియా నగర్ ఏరియాల్లో శుక్రవారం పోలీస్ సిబ్బందితో కలిసి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు సెలవుల్లో ఊర్లకు వెళ్లేటప్పుడు ఇళ్లకు తాళాలు వేసి విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని కోరారు. దొంగతనాల నివారణకు ప్రతి డివిజన్లో సీసీటీవీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న క్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా జాగ్రత్తలు పాటించాలని ఏసీపీ కోరారు. హెల్మెట్ ధరించిన వాహనదారులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పేర్కొన్నారు. మైనర్ బాలురకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల బాధ్యతగా ఉండి ప్రాణాపాయం కలగకుండా చూసుకోవాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 60 వాహనాలు, 7 ఆటోలకు జరిమానాలు విధించినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రవీందర్, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎం. ప్రశాంత్, హాజీపూర్, శ్రీరాంపూర్ ఉమెన్ పీఎస్, సీసీసీ నస్పూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







