సోన్, ఆర్.కె న్యూస్: సోషల్ మీడియాలో చిన్నారుల అసభ్యకర వీడియోలను అప్లోడ్ చేసిన ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సోన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం సోన్ మండలం సాకేర గ్రామానికి చెందిన యువకుడితోపాటు, మామడ మండలం కమల్కోట్ గ్రామానికి చెందిన యువకుడు కలిసి సోషల్ మీడియాలో ఇంస్టాగ్రామ్ లో చిన్నారుల అసభ్యకర చిత్రాలను వీడియోలను వారు చూసి, ఇతరులు చూసే విధంగా అప్లోడ్ చేశారని తెలిపారు. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు ఆయా పోలీస్ స్టేషన్లలో అప్లోడ్ చేసిన యువకులపై కేసు నమోదు చేశామని తెలిపారు. అరెస్టు చేసిన ఇద్దరు యువకులను రిమాండ్ కు పంపినట్లు సిఐ తెలిపారు.
12







