భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం, ప్రసాద వితరణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ పట్టణంలోని శ్రీ లక్ష్మి గణపతి శివ మార్కండేయ దుర్గ మాత దేవాలయంలో గురువారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అర్చకులు ఆనంద్ శర్మ పంచాంగ శ్రవణం నిర్వహించారు. కొత్త ఏడాదిలో గ్రహగతులు, వర్షపాతం, ఆదాయ వ్యయాల వివరాలను భక్తులకు వివరించారు. అనంతరం భక్తులకు భక్షాలను ప్రసాదంగా అందజేశారు. ఈ వేడుకల్లో నస్పూర్ పద్మశాలి సంఘం, దేవాలయ కమిటీ అధ్యక్షులు చిలగాని బొడ్డయ్య, సిరిపురం రామన్న, ప్రతినిధులు కుందారపు రమేష్, చిప్ప రాజబాబు, తౌటం మల్లేష్, కొండ శ్రీనివాస్, సబ్బాని భాస్కర్, ఆడేటి రాజన్న, క్యాతం రాజేష్, రవీందర్, రాములు, కృష్ణ, యాదగిరి, వెంకటేష్, రమేష్ లతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.







