ఉన్నత హోదాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, సింగరేణి సంస్థకు గర్వకారణంగా నిలవాలి

  • శ్రీరాంపూర్ మునిగంటి శ్రీనివాస్
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన సింగరేణి వారసులు.. స్టేట్ టాపర్లకు శ్రీరాంపూర్ జీఎం అభినందనలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగుల పిల్లలు ఉన్నత విద్యనభ్యసించి భవిష్యత్తులో గొప్ప హోదాల్లో స్థిరపడి తల్లిదండ్రులకు, సింగరేణి సంస్థకు గర్వకారణంగా నిలవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన సింగరేణి ఉద్యోగుల బిడ్డలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియా జీఎం కార్యాలయంలో విజేతలను సన్మానించారు. ఈ సందర్భంగా ప్రతి విద్యార్థిని సాధించిన మార్కులు, ర్యాంకులను అడిగి తెలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. స్టేట్ ఫస్ట్, సెకండ్ ర్యాంకులతో కార్మిక బిడ్డలు రాణించడం అభినందనీయమన్నారు. శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో నలుగురు విద్యార్థినులు ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి టాపర్లుగా నిలిచారు. జీఎం కార్యాలయ సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ గొల్లాల శ్రీనివాస్ కవల కూతుళ్లు ఇందు ప్రసన్న, శరణ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంఈసీ విభాగంలో ఇందు ప్రసన్న 500 మార్కులకు 496 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. శరణ్య 489 మార్కులతో రాష్ట్ర స్థాయి ఏడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఫైనాన్స్ విభాగం జూనియర్ అకౌంటెంట్ ఆడెపు భిక్షపతి కూతురు ఆధ్యశ్రీ ఇంటర్ మొదటి సంవత్సరంలో 440 మార్కులకు 437 మార్కులు పొంది రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. ఆర్కే 5 గని జనరల్ అసిస్టెంట్ రెంక చంద్రమౌళి కూతురు రెంక వైష్ణవి ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ విభాగంలో 1000 మార్కులకు 995 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకులో నిలిచారు. ప్రతిభ చాటిన నలుగురూ ఆడపిల్లలే కావడం గర్వకారణమని అధికారులు కొనియాడారు. ఈ అభినందన కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, సింగరేణి అధికారుల సంఘం శ్రీరాంపూర్ అధ్యక్షుడు కే. వెంకటేశ్వర రెడ్డి, ఆర్కే 5 గ్రూప్ ఏజెంట్ ఎన్. శ్రీధర్, ఆర్కే 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝా, డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ గొల్లాల శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment