హెచ్‌ఎంఎస్‌లో చేరిన యువ ఉద్యోగులు

నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మిక హక్కుల సాధనలో హెచ్‌ఎంఎస్ యూనియన్ చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై శ్రీరాంపూర్ ఏరియా జీఎం ఆఫీస్ సర్వే డిపార్ట్‌మెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న యువ ఉద్యోగులు ధారావత్ రాజేష్ నాయక్, శ్రీనివాస్‌లు యూనియన్‌లో చేరారు. శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రెటరీ రియాజ్ అహ్మద్, ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య వారికి యూనియన్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ధారావత్ రాజేష్ నాయక్‌కు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ కార్యదర్శిగా, శ్రీరాంపూర్ ఏరియా డిపార్ట్‌మెంట్స్ ఇన్‌చార్జ్‌గా సంస్థాగత బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి, సింగరేణిలో యూనియన్ బలోపేతానికి యువ కార్మికులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన యూనియన్ అగ్రనాయకత్వానికి రాజేష్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ అశోక్, రాజేంద్రప్రసాద్, సాయి, మహేందర్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment