రామగుండం, ఆర్.కె న్యూస్: పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం సేవలందించి ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డు వి. సత్యనారాయణకు రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. పెద్దపల్లి సబ్ యూనిట్‌కు చెందిన సత్యనారాయణ (హెచ్.జి 607) గత 41 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తూ, కరీంనగర్‌లోని రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలోనూ తన సేవలను అందించారు. ఆయన పదవీ విరమణ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్వయంగా సత్యనారాయణను శాలువాతో సత్కరించి, పూలమాల వేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నాలుగు దశాబ్దాల పాటు క్రమశిక్షణతో విధులు నిర్వహించిన సత్యనారాయణ సేవలను కొనియాడారు. ఆయన శేష జీవితం సుఖసంతోషాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, ఆర్ఐ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.
Daily Archives



