- నస్పూర్ మార్కండేయ ఆలయంలో సత్కరించిన పద్మశాలి సంఘం నాయకులు
- సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న రామ్మూర్తి–సంధ్యారాణి దంపతులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి దేవస్థాన నూతన పాలకవర్గ సభ్యురాలిగా నియమితులైన నస్పూర్ పట్టణానికి చెందిన బొద్దున సంధ్యారాణి–రామ్మూర్తి దంపతులను శుక్రవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. నస్పూర్ పద్మశాలి సంఘం, మార్కండేయ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఈ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో నిర్వహించిన సంకష్టహర చతుర్థి ప్రత్యేక పూజల్లో సంధ్యారాణి–రామ్మూర్తి దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం సంఘం నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షుడు చిలగాని బొడ్డయ్య మాట్లాడుతూ.. పద్మశాలీలు అన్ని రంగాలతో పాటు రాజకీయంగా కూడా మరింత ఎదగాలని, ఇలాంటి ఆలయ కమిటీలు, నామినేటెడ్ పదవుల్లో మన సామాజిక వర్గానికి ప్రాధాన్యత లభించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి కుందారపు రమేష్, నాయకులు కొండ శ్రీనివాస్, సబ్బని భాస్కర్, కన్నం సాంబయ్య, చిలువేరు సదానందం, కుడికాల రమేష్, పెరుమండ్ల రాజు, కుసుమ శంకర్, సత్కూరి రవీందర్, జక్కని సర్వేశం, ఆడేటి రాజన్న, క్యాతం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.








