ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా

  • 9, 32వ డివిజన్లలోని నమోదు కేంద్రాలను పరిశీలించిన మేయర్ ధర్ని మధుకర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు మార్గదర్శకత్వంలో అమలవుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి గొప్ప ఆర్థిక భరోసా కల్పిస్తుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ ప్రశాంత్ నగర్, 32వ డివిజన్ ఏఎస్ఆర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా లబ్ధిదారుల నమోదు కేంద్రాలను ఆయన సందర్శించి ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నమోదు కేంద్రాల వద్ద అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న మేయర్.. అర్హులైన ప్రతి కుటుంబానికి పథకం ప్రయోజనాలు అందేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని, నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని సూచించారు. అనంతరం మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా ఆదుకోవాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబం నుంచి ఒకరికి రూ. 5 లక్షల జీవిత బీమా రక్షణ లభిస్తుందని, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలిపారు. బీమా పొందిన వ్యక్తి మరణించిన పక్షంలో నామినీకి పరిహారం అందజేసి ఆ కుటుంబానికి అండగా నిలవడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment