ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
పవర్ లక్ష్మి కుటుంబానికి రూ. 2.50 లక్షల ఎల్ఓసీ అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ కు చెందిన పవర్ లక్ష్మి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 2,50,000 ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాన్ని శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ప్రేమ్ సాగర్ రావు చెప్పారు. పవర్ లక్ష్మి కుటుంబ సభ్యులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి ఈ నిధులను మంజూరు చేయించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తోందని ఆయన వివరించారు. భవిష్యత్తులోనూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే చొరవ పట్ల లక్ష్మి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.




మంత్రోచ్చారణల మధ్య నియమ నిష్టలతో జరిగిన ఈ కార్యక్రమంలో దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని రామనామ స్మరణతో తరించారు. వేసవి తాపం దృష్ట్యా భక్తుల కోసం మజ్జిగ సౌకర్యం కల్పించారు. సీతారాముల కళ్యాణం అనంతరం పానకంతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని జీఎం దంపతులతో పాటు రాంపూర్ ఏరియా అధికారులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, స్థానికులు ఈ కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్సార్పీ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, డీజీఎం దామోదర్, న్యూటెక్ గని మేనేజర్ కూరపాటి శ్రీనివాస్, సీనియర్ పీఓ సురేందర్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.